వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
రాష్ట్ర సాధన కోసం అనునిత్యం పరితపించిన తెలంగాణ వాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఈరోజు ఆయన వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనునిత్యం పాటుపడిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని తొలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యజించిన గొప్ప త్యాగశీలి అని జీవితకాలం తెలంగాణ సాధన కోసం పరితపించిన మహానుభా వుడు.. గత పాలకులు స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆయనను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి ఆయన పేరు పెట్టడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చిందం రవి ప్రపంచ రెడ్డి బాసని రవి రాజు కట్టయ్య మార్కండేయ వలుపదాసు రాము తదితరులు పాల్గొన్నారు.