ఆచార్య గాలిపెల్లి చోళేశ్వరాచారి శ్రీశ్రీ కళావేదిక జాతీయ యువజన ఉపాధ్యక్షులుగా నియామకం

గొల్లపల్లి నేటి ధాత్రి:
శ్రీశ్రీ కళావేదిక జాతీయ యువజన విభాగం ఉపాధ్యక్షులుగా నియమితులైన రాఘవపట్నం గ్రామం,గొల్లపల్లి మండలం, జగిత్యాల జిల్లా కి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, కవి, రచయిత, విశ్లేషకుడు ఆచార్య గాలిపెల్లి చోళేశ్వరాచారి . ఈ సందర్భంగా ఆచార్య మాట్లాడుతూ ap ప్రభుత్వ బోయ భీమన్న జీవిత సాఫల్య, గుర్రం జాషువ ప్రభుత్వ పురస్కార గ్రహీత, కవి సామ్రాట్, శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ నియమించారు అని నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెడుతూ ఎందరో యువ కళాకారులను, కవులను ఈ సమాజంలో వారికి తగు గౌరవాన్ని వారిలోని ప్రతిభను వెలుగులోకి తీసే ప్రయత్నం చేస్తానని, కవిత్వం రాస్తూ ఎవరిచే గుర్తింపబడని కవులను శ్రీశ్రీ కళావేదిక ద్వారా వారి కలాన్ని , గలాన్ని వినిపిస్తానని హామీ ఇస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తి మంద ప్రతాప్ సార్ మరియు జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి అమ్మగారికి , జాతీయ అధ్యక్షులు ఈశ్వరీ భూషణం గారికి, జాతీయ మహిళా అధ్యక్షులు చిట్టెం లలిత, జాతీయ మీడియా కన్వీనర్ నూక సంపత్ కి మరియు నాకు పదవి రావడంలో తోడ్పటు అందించిన ప్రతి ఒక్క సాహితీ మిత్రునికి నాయొక్క కృతజ్ఞతలు వందనాలు. ఈ సందర్భంగా జాతీయ సభ్యులు గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్, డాక్టర్ చిర్ర సతీష్, డేగ విజయ్ పాటు యువజన కమిటీ సభ్యులు తాటి హరీష్, వడ్డే సుధాకర్ , కమిటీ సభ్యులు అక్షిత, భానుశ్రీ,రవి సునీల్ యాదవ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. చోలేశ్వర్ చారి. సాహితీరంగంలో ఎదుగుతున్న క్రమంలో రాఘవపట్నం గ్రామస్తులు, యువజన సంఘం నాయకులు, గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.చోలేశ్వర్ చారి పలు సందర్భాలలో లీఫ్ ఆర్టిస్టుగా మరియు సూక్ష్మ కళాకారుడిగా తన యొక్క ప్రతిభ ద్వారా జాతీయ అంతర్జాతీయ ప్రపంచ రికార్డులను మరియు జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రతిభ పురస్కారాలు 2017 ఉత్తమ శిల్పకారుడిగా 2024 ఉత్తమ ఉపాధ్యాయునిగా పురస్కారాలు అందుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!