సోలార్ బ్యాటరీలు దొంగలించిన నిందితుల అరెస్ట్.
#ఎస్సై వి గోవర్ధన్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
నర్సంపేట డివిజన్లోని దుగ్గొండి, నల్లబెల్లి, మండలాల్లోని పలు గ్రామాల్లో సోలార్ లైట్లు సంబంధించిన బ్యాటరీలను దొంగలిస్తున్న ముఠా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై వి గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం నల్లబెల్లి క్రాస్ జాతీయ రహదారి 365 పై ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా మల్లంపల్లి వైపుగా వెళ్తున్న ఒక బజాజ్ ఆటోలో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా అనుమానం వచ్చి ఆటోను పరిశీలించగా సదరు వ్యక్తులు ఆటో వదిలి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని ఆటోని పరిశీలించగా అందులో 10 సోలార్ బ్యాటరీలు లభ్యం అయ్యాయి. పట్టుబడిన నిందితులను వారితో ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించారు పట్టుబడిన వారిలో పర్వతగిరి మండలానికి చెందిన భూక్య నవీన్, అల్లాడి దుర్గ స్వామి, సంగెం మండలం తీగరాజు పల్లి కి చెందిన గూడూరు అరవింద్, కర్నే అఖిలాష్ గా పోలీసులు గుర్తించారు. వీరి నుండి 10 బ్యాటరీలు సహా ఒక ఆటో స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు .