గుడిసే వాసుల కల నెరవేరేనా!
పేదలు వేసుకున్న గుడిసె లకు పట్టాలు లభించేనా!
శాయంపేట నేటిధాత్రి:
పేద ప్రజలకు సొంతింటి కలగానే మిగిలిపోతుందా ఉద్యోగులు మధ్యతరగతి ప్రజలు కూడా పెట్టిన సొమ్ము లేదంటే బ్యాంకు ద్వారా ఇంటి జాగాలు కొనుగోలు చేస్తు న్నారు కానీ పేదలకు కొనుక్కునే స్తోమత లేక కష్టం వారికి జాగలుకొని ఇల్లు కట్టుకుని స్తోమత ఉంటుందా! అందువల్ల వారి సొంతింటి కలను నిజం చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కానీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవ డంతో శాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ భూములు గుడిసెలు వేసుకుని నిరీక్షణగా ఎదురుచూస్తున్న గుడిసె వాసుల ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక వసతులు లేకున్నా జీవనం కొనసాగిస్తున్నారు.
పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
శాయంపేట మండలం మాందారిపేట గ్రామంలో పేదల వారికి సొంతింటి కల నెరవేరేనా! ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నగుట్ట ప్రాంతంలో ఇల్లు లేని నిరుపేదలు గుడారాలు వేసుకొని ఎండ, వేడి ,చలి తీవ్రతను భరిస్తూ జీవనం గడుపుతున్నారు ఇప్పటికైనా అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలు, ప్రజల గుండెల్లో కలకాలం నిలుస్తుంది కాబట్టి తక్షణమే పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాబట్టి సకాలంలో గుడిసే వాసులకు అండగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు.