* హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
* సినియర్ జర్నలిస్ట్ ఎరబెల్లి సుధీర్
చేర్యాల నేటిధాత్రి…
అన్ని పత్రికలతో సమానంగా చిన్న పత్రికలకు సైతం అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని హైకోర్టు ధర్మాసనం తీర్పు నివ్వడాన్ని స్వాగతింస్తున్నామని సినియర్ పాత్రికేయులు ఎరబెల్లి సుధీర్ అన్నారు. ఈ మేరకు బుధవారం అయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులు జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విజయకేతానం చేశారు. తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2016 లోని షెడ్యూల్ ‘ఈ’ ను హైకోర్టు కొట్టి వేయడం అభినందనీయమన్నారు.చిన్న పత్రికలను నాలుగు విభాగాలుగా విభజించడం చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. చిన్న పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులను ఏబీసీడీ కేటగిరీలుగా విభజించడం సరైనది కాదని కోర్టు అభిప్రాయపడినట్లు వారు తెలిపారు. ఈ మేరకు హైకోర్టు ధర్మసనానికి అయన కృతజ్ఞతలు తెలిపారు.