ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
గణపురం నేటి ధాత్రి
28 సెప్టెంబర్ గురువారం గణపురం మండల కేంద్రంలో ఉద్యమ నేత ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం మీడియా మిత్రులకు ఇళ్ల పట్టాలు అందిస్తున్న తరుణం నైతిక విలువలతో కూడిన సమాజ హితం కోరే మీడియా సంస్థలు సమాజంలో ముందు ఉండాలి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వారధిగా నిలిచే కీలక పాత్ర మీడియా కి ఉందని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు.గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా గారితో కలిసి గణపురం తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా మిత్రుల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.గుర్తింపు పొందిన మీడియా మిత్రులకు ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర సాధనలో మీడియా ప్రధాన భూమిక పోషించింది.ఉద్యమ నేత పరిపాలన అధ్యక్షుడు కావడం అన్ని రంగాల ప్రజలను గౌరవిస్తున్నారు.
భూపాలపల్లి జిల్లాలో ఉన్న గుర్తింపు పొందిన మీడియా సోదరులకు పూర్తక్ 5 స్థాయిలో పట్టణాలను అందేలా చర్యలు తీసుకుంటా. రాని వారు అధైర్య పడొద్దు, ఇంకా రావాల్సిన వారికి కూడా పట్టాలు అందిస్తాం.సమాజంలో జరుగుతున్న పరిణాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్నారు.
కరోన లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీడియా సోదరులు ముఖ్య పాత్ర పోషించారు.
లాక్ డౌన్ పరిస్థితిల్లో కూడా కరోన వార్తలను ప్రాణాలకు తెగించి ప్రచారాలు చేసిన మీడియా.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు.