
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
ఐదు బహుళ జాతి సంస్థల సంయుక్తంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో ప్రమాద బీమా పాలసీలు అందిస్తున్న క్రమంలో పాలసీ వివరాల కొత్త పాలసీ నమోదు క్యాంపును నిర్వహించడం జరిగింది. శుక్రవారం రోజు మహదేవ్పూర్ తపాలా కార్యాలయం ముందు జి ఏ సి,పాలసీ క్యాంపును నిర్వహించడం జరిగింది. సుమారు 30 కి పైగా ఏ జి ఏ పాలసీ తీసుకోవడం జరిగిందని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ అజరుద్దీన్ అన్నారు. ప్రమాదవశాత్తు మృతి, అంగవైకల్యం, విద్యా ప్రయోజనం, కుటుంబ రవాణా, ప్రయోజనాలు శాశ్వత అంగవైకల్యం, ప్రమాదవశాత్తు వైద్యం ,ఆసుపత్రిలో చికిత్స దినాలకు, అవశేషాల స్వదేశానికి తరలింపు, శాశ్వత పాక్షిక వైకల్యం, కోమా లాంటి సందర్భాల్లో పాలసీలు ఒక వెయ్యి రూపాయల నుండి మొదలుకొని 10 లక్షల రూపాయల వరకు పాలసీలు వర్తింపబడతాయని, క్యాంప్ వద్ద సందర్శించిన ప్రజలకు అవగాహన కల్పించారు. పాలసీ చేసుకున్న 15 రోజుల సమయం పూర్తి కావడంతో భీమ వర్తింపడం జరుగుతుందని తెలిపారు, స్థానిక తపాలా అధికారి ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించడం జరిగింది. క్యాంపు నిర్వహించినవారు సత్యం రాజ్ కుమార్ తోపాటు ఇతర తపాలా సిబ్బంది ఉన్నారు.