
Boat Accident During Mandadi Movie Shoo
మందాడి సినిమా షూటింగ్లో ప్రమాదం.. పడవ బోల్తా..
తమిళ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మందాడి’. తమిళ కమెడియన్ సూరి హీరోగా నటిస్తున్నఈ చిత్రంలో తెలుగు నటుడు సుహాస్ విలన్‌గా నటిస్తున్నాడు.
తమిళ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మందాడి’. తమిళ కమెడియన్ సూరి హీరోగా నటిస్తున్నఈ చిత్రంలో తెలుగు నటుడు సుహాస్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చెన్నై సముద్రతీరంలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకుంది (boat accident).
షూటింగ్ సమయంలో సాంకేతిక నిపుణులు ఉన్న పడవ సముద్రంలో బోల్తా పడింది. ఆ సమయంలో ఆ పడవలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిద్దరినీ మిగిలిన వారు కాపాడారు. అయితే కెమెరాలు, ఇతర షూటింగ్ సామగ్రి మాత్రం సముద్రంలో కొట్టుకుపోయాయి. దాదాపు కోటి రూపాయల వరకు నష్టం సంభవించినట్టు వార్తలు వస్తున్నాయి (film shoot capsizes).సుహాస్‌కు ఇది తొలి తమిళ సినిమా (Suhas movie shoot accident). మతిమారన్ పుగళేంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వెట్రిమారన్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది.