ఏబీవీపీ రాష్ట్ర నాయకురాలు మామిడి అక్షిత
జైపూర్,నేటి ధాత్రి:
అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ లో భాగంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు స్వచ్ఛంద గా బంద్ లో పాల్గొని బంద్ ని విజయవంతం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకురాలు మామిడి అక్షిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది గాని పరిపాలన విధానం మారలేదు అని అన్నారు. అలాగే అధికారం మారింది గానీ అధికారుల తీరు మారలేదు. విద్యారంగం మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేకుండా పోయింది విద్యాసంస్థలు మొదలై సుమారుగా 10 రోజులు కావస్తున్న ప్రైవేట్ పాఠశాలలు అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ అనుమతులు లేకున్నా విద్యాసంస్థలను చలామణి చేస్తున్నారు అలాగే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విచ్చలవిడిగా పుస్తకాలు అమ్ముతున్నప్పటికీ సంబంధిత అధికారులు మొద్దు నిద్ర విడాడం లేదని వాపోయారు. ఈరోజు బ్రాండ్ల పేరుతోటి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అమ్ముతూ ఆ సిలబస్ కాకుండా వేరే పుస్తకాలను కొంటె మీకు విద్యను ఎవరు చెప్తారు అవి మా పాఠశాలలో చెల్లవు అంటూ ప్రైవేట్ యాజమాన్యాలు కొన్ని బెదిరిస్తున్నారు. అలాగే ఈరోజు విద్యాసంస్థలన్ని విద్యా కేంద్రాలుగా ఉండాల్సిన విషయం మరిచి వ్యాపార కేంద్రంగా మారిపోయాయని అలాగే నూతనంగా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలకు పైగా కావస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగం గురించి మాట్లాడిన పాపాన పోలేదని,అలాగే తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి కరువైపోయారు కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేసే విధంగా సరైన పద్ధతిలో నడిపే విధంగా స్పెషల్ కమిటీని వేసి అధ్వానంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్దాలని అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీలని అరికట్టాలని ఏబీవీపీ తరఫున డిమాండ్ చేశారు .ప్రైవేట్ పాఠశాలల దోపిడీని విద్యాధికారులు అరికట్టకుంటే ఏబీవీపీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది గత ప్రభుత్వాన్ని ఏ రకంగానైతే చెప్పినట్టుగా గద్దె దింపుదామని చెప్పాము అదే రకంగా ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పే దిశగా ఏబీవీపీ ఉద్యమ కార్యచరణ ఉంటుందని వారు హెచ్చరించారు.ప్రైవేటు, కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలల్లో అక్రమంగా లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి.ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలి. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ ,కార్పొరేట్ పాఠశాలల్లో బుక్స్, యూనిఫామ్స్ అమ్ముతున్న యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ గుర్తింపు మరియు నిబంధనలను పాటించని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి.ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి.వెంటనే డిఇఓ, ఎంఈఓ అధికారులను నియమించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పెడుతున్న మధ్యాహ్నభోజనంలో జరుగుతున్న అవకతవకల పైన విచారణ జరిపి,నాణ్యతలేని ఆహారాన్ని అందిస్తున్న అధికారుల పైన చర్యలు తీసుకోవాలి మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి.మెగా డీఎస్సీ ద్వారా 24 వేలకు పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్ మరియు స్క్యావెంజర్లను నియమించాలి.విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ డిమాండ్లన్నింటినీ వీలైనంత తొందరలో పరిష్కరించకపోతే ఏబీవీపీ ఉద్యమ కార్యచరణ దిశగా ముందుకు వెళుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు తిరుపతి (నగర కార్యదర్శి), సతీష్, నవీన్, సాయి,శేష, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.