పాఠశాలలను సందర్శించిన ఏబీవీపీ నాయకులు

#నెక్కొండ ,నేటి ధాత్రి :అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నెక్కొండ శాఖ ఆధ్వర్యంలో నెక్కొండ మండలంలోని పాఠశాలలను ఏబి విపి నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాకం రాకేష్,గణేష్ సందర్శించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…సూరిపల్లి మరియు నెక్కొండ హైస్కూల్లో మధ్యాహ్నం భోజనాన్ని పరీక్షించారనీ, మధ్యాహ్న భోజనంలో పురుగులు,రాళ్ళు వస్తున్నాయని విద్యార్థుల తల్లితండ్రులు వాపోతున్నారనీ, జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల పరిస్తితి ఇలాగే ఉంది అని, ప్రతి రోజూ ఏదో ఒక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని మండి పడ్డారు, ఇన్ని జరుగుతున్నా ఏనాడూ జిల్లా మరియు మండల అధికారులు పట్టించుకోవడమే మానేశారని మండి పడ్డారు, పాఠశాలలో పురుగుల అన్నం తినలేక కొందరు విద్యార్థులు ఇంటి నుండి భోజనం తెచ్చుకుంటున్నారనీ మరి కొందరు అదే అన్నం తినలేక పడేస్తున్నారని ఇలా ఎందుకు జరుగుతుందో విద్యాధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి విద్యార్థులకు నాణ్యమైన విద్యను మరియు ఆహారాన్ని అందించాలి అని కోరారు, మరియు ప్రజా పాలన అనే చెప్పుకొనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ముగిసి మరియు 100 రోజులకు కావస్తున్నా ఇప్పటివరకు విద్యా శాక మంత్రిని నియమించకపోడం నిగ్గు చేటు అని ఎద్దేవా చేశారు,అలాగే మండలంలోని విద్యారంగ సమస్యలు తీర్చాలని మండలంలోనీ ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు లోకేష్, నీరజ్,దినేష్,హరీష్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!