
ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
చిట్యాల, నేటి ధాత్రి :
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77వ ఆవిర్భవ దినోత్సవం జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలో చిట్యాల పట్టణ అధ్యక్షుడు బుర్ర అభిజ్ఞ గౌడ్ ఆధ్వర్యంలో ఎబివిపి జెండా ఎగరవేయడం జరిగింది అనంతరం అభిజ్ఞ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని 1949లో నలుగురి విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ ఈరోజు అన్ని యూనివర్సిటీలలో కళాశాలలో అత్యధికంగా సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీ పని దేశం ధర్మం కోసం పనిచేసే విద్యార్థి సంఘం జాతీయ భావాలు కలిగినటువంటి విద్యార్థి సంఘం ఎబివిపి అని వారు అన్నారు..