మీరాకుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన అబ్రహం మాదిగ.
జహీరాబాద్. నేటి ధాత్రి:
భారతదేశపు తొలి మహిళా లోకసభ స్పీకర్ మీరాకుమార్ ని ఢిల్లీలోని ఆమె నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అబ్రహం మాదిగ. భారతీయ సామాజిక దార్శనికుడు, సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధులు డా. బాబూ జగ్జీవన్ రామ్ కూతురుగా ఆయన రాజకీయ వారసురాలిగా ఎన్నో పదవులను అధిరోహించారు. పలుమార్లు కేంద్ర మంత్రిగా, భారతదేశపు తొలి మహిళా లోకసభ స్పీకర్ గా భారతదేశానికి ఎనలేని సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ఆమోదం తెలిపిన ధీరవనితగా అభివర్ణించారు. రావి ఆకుపై వేసిన మీరాకుమార్ చిత్రాన్ని ఆమెకు బహుకరించారు. ప్రముఖ కవి రచయిత డప్పోల్ల రమేష్ రచించిన డా. బాబూ జగ్జీవన్ రామ్ సంక్షిప్త జీవిత చరిత్ర ఆంగ్లానువాదం డాక్టర్. బాబు జగ్జీవన్ రామ్, విషనరీ ఆఫ్ ఇండియా సొసైటీ “ పుస్తకాన్ని అందజేసి ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. మీరాకుమార్ ను కలిసిన వారిలో ఆయనతో పాటు ఉల్లాస్ మాదిగ ఉన్నారు.