Grand Ayyappa Padipuja & Abhishekam Ceremony
అయ్యప్పస్వామికి వైభవంగా అభిషేకాలు
కన్నుల పండుగగా పడిపూజ మహోత్సవం.
పడిపూజ దాతగా గీతాంజలి డి.జి స్కూల్ చైర్మన్ వేములపల్లి జయశ్రీ సుబ్బారావు
మహా అన్నదాన దాతలుగా శ్రీ ధర్మశాస్త అయ్యప్ప మిత్రబృందం,ఇతర దాతలు
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో 25 వ సిల్వర్ జూబ్లీ మండల పూజలు ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం అయ్యప్పస్వామి మహాదివ్య పడిపూజ వైభవంగా జరిగింది. నర్సంపేట శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవాలయ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా,అధ్యక్షుడు సైపా సురేష్,ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి,కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా సమక్షంలో నర్సంపేట పట్టణ గీతాంజలి డీ.జీ స్కూల్ అధినేత వేములపెల్లి జయశ్రీ సుబ్బారావు, వేములపల్లి అపర్ణ రాహుల్ చౌదరి, బత్తుల రచన చౌదరి, లక్ష్మి బాలాజీ సాయి విశ్వనాధ్ కుటుంబ సభ్యులు పడిపూజ దాతలుగా ఉన్నారు.దేవాలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా వేదమంత్రాలతో అయ్యప్పస్వామి పడిపూజను కన్నుల పండుగగా నిర్వహించారు.ఉదయం గర్భగుడిలో సుప్రభాతంతో మొదలై గణపతిహోమం కార్యక్రమం,ప్రత్యేక పూజలు

చేపట్టారు.అనంతరం అయ్యప్పస్వామికి అష్టాభిషేకాలు కళాశాభిషేకాలు చేయగా భక్తులు ఎంతగానో తరించిపోయారు.అయ్యప్ప స్వామిపైన వివిధ రకాల పుష్పాలతో సామూహిక పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం దేవాలయం పదునెట్టాంబడిపై కర్పూరలో వెలిగించగా జ్యోతిరూపంలో కనిపించగా ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల అయ్యప్పస్వామి నామస్మరణతో మారుమ్రోగింది.మండల పూజల్లో భాగంగా నిర్వహిస్తున్న మహా అన్నదాన కార్యక్రమం సోమవారం నాటికి 39 వ రోజుకు చేరుకున్న తరుణంలో అన్నదాతలుగా అయ్యప్ప దేవాలయ గురుస్వామి బోట్ల నాగరాజు ఆధ్వర్యంలో శ్రీధర్మశాస్తా
అయ్యప్ప మిత్రబృందంతో పాటు
సాయి సుప్రీత కర్షన్,దొడ్డ సాయి భవన, లింగాల సంధ్య రణదీర్ రెడ్డి ఉన్నారు.

గజమాలతో ఘన సత్కారం..
పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించిన దాతలు గీతాంజలి డి.జీ స్కూల్ చైర్మన్ వేములపల్లి జయశ్రీ సుబ్బారావు కుటుంబ సభ్యులను శ్రీధర్మశాస్తా అయ్యప్ప స్వామి దేవాలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో
ట్రస్ట్ సభ్యులు ఇరుకు కోటేశ్వర్ రావు, చెంచారావు,పాలకుర్తి శ్రీనివాస్, మల్యాల ప్రవీణ్ కుమార్, మల్యాల రాజు,గురుస్వాములు సంజీవ రావు,బొట్ల నాగరాజు,యాదగిరి, రాయసాబ్,అంకూస్ గౌడ్,శ్రీధర్మశాస్తా
అయ్యప్ప మిత్రబృందం, చంద్రమౌళి గౌడ్,భరత్,అజయ్,రాజిరెడ్డి కందుల శ్రీనివాస్ గౌడ్,మాలాదారులు,భక్తులు పాల్గొన్నారు.
