వరసిద్ధి వినాయక స్వామికి అభిషేకాలు.
జహీరాబాద్. నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలం రేజింతల్ లోని స్వయంభు వరసిద్ధి వినాయక స్వామికి మంగళవారం ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో స్వామి వారికి పూజా కార్యక్రమాలను జరిపించారు. అనంతరం వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు సంగారెడ్డి తో పాటు మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చారు.