శివాలయంలో అభిషేకం హనుమంతునికి బిల్వభిషేకం,,,
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
వర్షాకాలం మొదలై నెల గడిచిపోతున్న వర్షాలు కురవకపోవడం వ్యవసాయంపై ఆధారపడిన రామాయంపేట మండలంలో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు కాలం పై నమ్మకం లేక చివరకు దేవుడే దిక్కని భక్తితో శివాలయాల్లో హనుమంతునికి బిల్వాభిషేకం నిర్వహించిన సంఘటన రామాయంపేట మండలంలోని కాట్రాల గ్రామంలో చోటు చేసుకున్నది వివరాలు కెళ్తే కాట్రియాల గ్రామంలోని పెద్దలు సమావేశం నిర్వహించి గ్రామంలోని శివాలయంలో నీటితో శివలింగంపై అభిషేకం నిర్వహించారు హనుమంతునికి బిల్వాభిషేకం ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు చేశారు ఊరేగింపుగా దేవాలయానికి వెళ్లి వానలు కురిసి పంటలు పండాలని భక్తి పూర్వకంగా కోరుకున్నారు మాజీ సర్పంచ్ మైలారం శ్యామ్ గ్రామ పెద్దలు శ్యామ్ రెడ్డి కొప్పుల వెంకటరాజ్యం కొత్త రాజేందర్ గుప్తా చాకలి శ్యాములు గొల్లశ్రీశైలం మహేందర్ రెడ్డి కంది మల్లారెడ్డి శ్రీశైలం రెడ్డి కుమార్ నాగరాజు పెద్ద ఎత్తున ప్రజలు యువకులు మహిళలు పాల్గొన్నారు