అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో చెన్నవెల్లి పెద్ద బాలయ్య(57) అనారోగ్యంతో మరణించారు.
మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.

రాజాపూర్ మండలంలోని కుత్నేపల్లి పంచాయతీలోని చాకలి రాములమ్మ(80) అనే వృద్ధురాలు అనారోగ్యంతో మరణించారు.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సేవ్య నాయక్, ఉప సర్పంచ్ కాశన్న, ఎస్ సి సేల్ మండల ప్రధాన కార్యదర్శి శేఖర్, లక్ష్మణ్, జంగయ్య, నార్య, వెంకటయ్య, సుధాకర్, గ్రామస్తులు, బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ముదిరెడ్డిపల్లి అంత్యక్రియల కార్యక్రమంలో సర్పంచ్ పెంటయ్య, ఎంపిటిసి శేఖర్ గౌడ్, ఉప సర్పంచ్ వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ నారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ నర్సింలు, వార్డ్ మెంబర్ రాములు, వార్డ్ మెంబర్ రాజు బి ఆర్ ఎస్ నాయకులు, యువసేన సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!