మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలకేంద్రనికి చెందిన ఉడిత్యాల లక్ష్మమ్మ(30) అనారోగ్యంతో మరణించడం జరిగింది.
విరి మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ అల్లె శ్రీనివాస్, మాజీ ఏ ఎం సి డైరెక్టర్ వనపర్తి దేవేందర్, కొంగళ్ల శ్రీను, అల్లే మల్లేష్, చారుకొండ రాజు, సత్తయ్య, చిన్న వెంకటయ్య, నర్సింహా, చిన్న లింగం, పాండు గ్రామస్తులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.