వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికి గాను
జాతీయ కరాటే రిఫరీకి వరల్డ్ కరాటే ఫెడరేషన్ కొత్త పద్ధతిలో పరీక్షలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుండి 300 మంది కరాటే మాస్టర్లు ఇందులో పాల్గొన్నారు. కాగా వేములవాడ చెందిన సీనియర్ జర్నలిస్ట్, కరాటే అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబ్దుల్ మన్నాన్ పరీక్షల్లో పాల్గొని కరాటే జడ్జి – ఏగా అర్హత సాధించారు. ఈ సందర్భంగా అబ్దుల్ మన్నాను కు కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి షిహాన్ రజనీష్ చౌదరి సర్టిఫికెట్స్అందజేశారు. పరీక్షలో ఉత్తీర్ణులైన మన్నాన్ ను జాతీయ ప్రధాన కార్యదర్శి రజిని చౌదరి, తెలంగాణ రిఫరీ కమిషన్ చైర్మన్ సెన్సాయ్ పాపయ్య, సురభి వేణుగోపాల్, గౌరు రాజిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి నరేందర్, కోశాధికారి సాయికుమార్ ప్రశంసించారు.
జాతీయ కరాటే జడ్జి-ఏ గా అబ్దుల్ మన్నాన్ కు అర్హత
