
SFI District Secretary Kumari Raj Kumar
మహాదేవపూర్ మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ తక్షణమే ఏర్పాటు చేయాలి..
SFI మహాదేవపూర్
ఆగష్టు5 (నేటి ధాత్రి )
ఆధార్ సెంటర్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
గతంలో ఉన్న ఆధార్ సెంటర్ ను తీసివేయడం జరిగింది
SFI జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజ్ కుమార్
మహదేవపూర్ మండలం.భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మహదేవపూర్ మండల కేంద్రంలో సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు మాట్లాడుతూ మహాదేవపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్ ను తీసివేయడం ద్వారా ఆ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు సందర్భంగా తెలియజేశారు మరీ ముఖ్యంగా విద్యార్థులు అప్లై చేసుకునే కులము మరియు ఆదాయం నివాసం చేసుకోవడానికి ఆధార్ కార్డులో పేర్లు మిస్టేక్ ఉన్న విద్యార్థులు ఆధార్ కార్డు చేంజ్ చేసుకోవడానికి మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మహదేవపూర్ మరియు పలిమల మండలాలకు సంబంధించిన విద్యార్థులు గాని ప్రజలు గాని ఆధార్ అప్డేట్ కోసం జిల్లా కేంద్రానికి వెళ్లవలసి వస్తుంది. ఆ సమయంలో వారు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కొంతవరకు పని కాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే ఈ సమస్యలన్నింటిని దృష్టిలో ఉంచుకొని మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు