# నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్.
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలో నూతనంగా ప్రారంభించిన ప్రభుత్వ జిల్లా జనరల్ హాస్పిటల్ లో ఔట్ పేషెంట్ కు వచ్చే రోగులు అందరూ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్య మోహన్ దాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి ఔట్ పేషెంట్ కు వచ్చే రోగులకు ల్యాబ్ టెస్టుల కోసం, రక్త ,మూత్ర పరీక్షలకు ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో ఓపి రోగుల రిపోర్టులు పంపడానికి అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆధార్ కార్డు తో పాటు ఏదైనా స్మార్ట్ ఫోన్ నెంబరు వారివెంట తప్పనిసరిగా తీసుకురావాలని డాక్టర్ మోహన్ దాస్ కోరారు.