రుద్రంగి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కొన్ని రోజుల క్రితం మరణించిన ఓ నిరుపేద కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న యువకుడు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. రుద్రంగి మండలకేంద్రానికి చెందిన వీసరి భూమానందం అనే వ్యక్తి
ఆనారోగ్యంతో భాదపడుతూ గత
నాలుగు రోజుల క్రితం మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు , కడుపేదరికంతో భాదపడుతున్న సంఘటన తెలుసుకుని చలించిపోయిన రుద్రంగి మండల కేంద్రానికి చెందిన నెవురి నవీన్ 16 వేల రూపాయలు మరియు కొంత మొత్తంలో సరుకులను వారి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.
అనారోగ్యంతో తండ్రి చనిపోవడంతో
ఇద్దరు కూతుళ్ళ పరిస్థితి దయనీ
యంగా మారిందని తెలుసుకొని వారి కుటుంబ పోషణకు
కొంతైన సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వీరికి ఆర్థిక సహాయం చేశానని తెలిపారు.
ఆర్థిక చేసిన యువకుడి ని గ్రామ ప్రజ ప్రతినిదులు, గ్రామస్తులు
అభినందించారు. అతనితో ద్యావల దిలీప్ ఉన్నారు.