
చిట్యాల.నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన మూసాపూరి రమేష్ అనే వ్యక్తి విద్యుదాఘాతంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రాని కి చెందిన రమేష్ తన ఇంటి పైన ఉన్న ఇనుప పైపును కిందికి తీస్తుండగా.. తన ఇంటి పైన ఉన్న 11 కెవి వైర్లకు తగిలితీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటా హుటీనా తన కుటుంబ సభ్యులు చిట్యాల సివిల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎంజిఎంకు తరలించారు.