జైపూర్, నేటి ధాత్రి:
సైకిల్ పై భారతదేశం పర్యటన చేస్తున్న యువకుడు రసూల్ పల్లి రహదారి వెంట కనిపించడంతో నేటి ధాత్రి జైపూర్ మండల్ రిపోర్టర్ నేరెళ్ల నరేష్ గౌడ్ అతని దగ్గరకు వెళ్లి యాత్ర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అతని పేరు ఉత్తo బర్మన్ వయసు 24 సంవత్సరాలు తండ్రి పేరు గోపాల్ బర్మన్ పశ్చిమ బెంగాల్ వాసి ఇతను సైకిల్ పై ప్రయాణం చేపట్టి నెలరోజులు అవుతుందని చెప్పాడు. అతని యొక్క ముఖ్య ఉద్దేశం కాలుష్య, పర్యావరణ పరిరక్షణ, మరియు రక్తదానం చేయడం కాలుష్య రహిత దేశముగా మార్చడానికి ప్రజలను చైతన్య పరచడానికి యాత్ర చేస్తున్నానని చెప్పాడు.