చికిత్స పొందుతూ యువకుడు మృతి…
ముత్తారం :- నేటి ధాత్రి
మండలం లోని ఖమ్మం పల్లి గ్రామనికి చెందిన పర్శ గట్టు (28) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పర్శ గట్టు గత 20 రోజుల క్రితం బైక్ అదుపు తప్పి కింద పడడం తో తీవ్ర గాయలు అయ్యాయి. గత పది రోజులు గా కరీంనగర్ లోని చల్మెడ ఆసుపత్రి లో చికిత్స పొంది మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య సంధ్య, కుమార్తె కుమారుడు ఉన్నారు.
