శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని ధైనంపెల్లివంశీ అనే వ్యక్తి పై చదువుల కోసం విజయవాడ పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వచ్చి సెలవులు అనంతరం తిరిగి కాలేజీ పోవడానికి నిరాకరించినాడు. తన తండ్రి అయిన సంపత్ వారి కుమారుడిని కాలేజీకి వెళ్లి మంచిగా చదువుకోమని చెప్పగా తనకు చదువు అబ్బ లేదని అంత దూరం వెళ్లి చదువుకోనని ఇక్కడే ఉండి తనతో పాటు పనిచేసి చదువుకుంటానని చెప్పినాడు. కానీ అందుకు తన తండ్రి నిరాకరించి ఎలాగైనా ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సంపాదించాలని చెప్పి హాస్టల్ కి వెళ్దామని చెప్పగా అందుకు వంశీ ఎలా అయినా వారి తల్లిదండ్రులు హాస్టల్కు పంపుతారేమో మనస్తవానికి గురై క్షణికావేశంలో శనివారం రోజున తెల్లవారుజామున మూడు గంటలకు పురుగుల మందు తాగగా వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో చేర్పించినారు ఆ రోజు నుండి చికిత్స పొందుతూ ఈరోజు అనగా శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో మరణించినాడు. మృతుని తండ్రి అయిన ధైనం పెల్లి. సంపత్ దరఖాస్తు మేరకు శాయంపేట ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు