
మందమర్రి, నేటిధాత్రి:-
గుర్తుతెలియని వాహనం ఢీకొని మంగళవారం అర్ధరాత్రి పట్టణానికి చెందిన బండి అనిల్ అనే యువకుడు మృతి చెందాడు. వృత్తి రీత్యా మేకల వ్యాన్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న అనిల్ మంగళవారం అర్ధరాత్రి తన పనులు ముగించుకొని, ఇంటికి వస్తున్న సమయంలో అతని ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం (టిఎస్ 19ఏ 6780) హెచ్ఎఫ్ డీలక్స్ వాహనాన్ని పట్టణంలోని ఎర్రగుంటపల్లి క్రాస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అనిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈమేరకు మృతిని అన్న బండి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై ఎస్ రాజశేఖర్ తెలిపారు.