
Injured Boy'
చిన్నారి బాలునిపై గుర్తు తెలియని అగంతకుడు కత్తితో దాడి
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి నిద్ర పోతున్న చిన్నారి బాలుడు పై కత్తితో దాడి చేసిన సంఘటన జరిగింది,
స్థానికులు గాయపడిన బాలుడి నానమ్మ మంగమ్మ తెలిపిన కథనం ప్రకారం.. పందుల మునీష్ కుమార్ (6) నారాయణపురం యుపిఎస్ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నాడు. తండ్రి పేరు ఉపేందర్, తల్లి శిరీష ముగ్గురు సంతానం, రోజువారి వృత్తిరీత్యా డ్రైవర్ పని నిమిత్తం వెళ్లి రావడం జరిగిందని, గాయపడిన బాలుడు పెద్ద కుమారుడు పందుల మనీష్ కుమార్ తల్లిదండ్రులు ఉపేందర్ శిరీష మరో బాలుడు ఒకే దగ్గర పడుకోవడం జరిగిందని, ఇంటికి రెండు డోర్లు ఉంటాయి ఒకదానికి లోపల బేడమ్ (గొళ్లెం) ఉందని, గొల్లం లేని మెయిన్ డోర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు గురువారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో బాలుడు మునిష్ కుమార్ రోదిస్తుండగా గుర్తించిన నానమ్మ మంగమ్మ తండ్రి ఉపేందర్ చూడడంతో బాలుడు స్కూల్ యూనిఫామ్ పై రక్తస్రావంతో ఉండడంతో వెంటనే గ్రామంలోని ఓ వైద్యుని దగ్గరికి తీసుకెళ్లామని, ఆ వైద్యుడు మహబూబాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లమనడంతో వెనుతిరిగామని, ఈ క్రమంలో వైద్యుని ఇల్లు బొడ్రాయి దగ్గర ఉండడంతో కారులో బొడ్రాయి వద్దకు వచ్చి వెనుతిరిగి వెళ్ళారని ఓ వ్యక్తి తెలిపాడు. అనంతరం మహబూబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లడం జరిగిందనీ, గతంలో చిన్న కుమారుడు ఎనిమిది నెలల క్రితం వాటర్ సబ్బులో పడి మృతి చెందాడని , నాకు గ్రామంలో ఎలాంటి వారితో శత్రుత్వం లేదని గుర్తుతెలియని అగంతకుడు నా బాలుడిని గాయపరిచినట్లు తెలిపారు. అని తెలుసుకున్న కేసముద్రం పోలీసులు ట్రైనింగ్ ఎస్సై నరేష్ పోలీస్ సిబ్బంది విచారణ చేపడుతున్నారు.