BRS MLAs Workshop Held at Golconda Resort
గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో ప్రారంభమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వర్క్ షాపు .
జహీరాబాద్ నేటి ధాత్రి:
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్స్ సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ విప్ వివేకానంద హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రజా ప్రతినిధులకు మార్గనిర్దేశం చేశారు. సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, నియమ నిబంధనలు (రూల్ బుక్), రాజ్యాంగ విషయాలపై అవగాహన సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలను మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూధనా చారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, పలువురు సీనియర్ నాయకులు నిర్వహించారు.
గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్ రావు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యలను సమర్థవంతంగా ప్రదర్శించే పద్ధతి, ప్రభుత్వ విధానాలపై పార్టీ వైఖరిపై ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేశారు.
