
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రనికి చెందిన పిట్టల మంజుల కు ఆర్థిక సాయం చేసేందుకు హన్మకొండ నుండి చందుర్తికి వచ్చి మంచి మనసు తో మానవత్వాన్ని చాటుకున్నారు హన్మకొండ వాసులు…. పూర్తి వివరాల్లోకి వెళితే చందుర్తి మండల కేంద్రానికి చెందిన పిట్టల మంజుల నెలరోజుల క్రితం ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి తీవ్ర గాయాలై రెండు కాళ్లు విరిగి మంచానికే పరిమితమైన విషయం తెలుసుకొని రెక్కాడితే డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన మంజుల ఆర్థిక పరిస్థితి బాగలేక మెరుగైన వైద్యానికి డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న హనుమకొండ వాస్తవ్యులు నుగునూరి చంద్రమోహన్ వారి మిత్ర బృందం సహకారంతో బుధవారం మంజుల ను పరామర్శించి స్థానిక సీఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా మంజుల కుటుంబానికి రెండు నెలలు సరిపడే నిత్యవసరా సరుకులు అలాగే నెలరోజులకు సరిపడే మాత్రలు, పండ్ల తో పాటు కొంచెం నగదును బాధిత కుటుంబానికి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు… ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అన్న నానుడిని నిజం చేస్తూ రెండు జిల్లాల సరిహద్దులను దాటుక వచ్చి ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఎదుటి మనిషికి సహాయం చేయాలన్న గొప్ప ఆలోచన ఎంత గొప్పదో రుజువు చేశారు హన్మకొండ వాసులు… పిట్టల మంజులకు ఆర్థిక సాయం అందజేసిన నూగూరి చంద్రమోహన్, మామిండ్ల శ్రీధర్ రెడ్డి ఎస్.డి.పి.ఓ. కోదాడ కి వారి మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు… ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ అజీమ్,స్థానిక ఎంపీటీసీ పులి రేణుక సత్యం గౌడ్,దారం చంద్రం,పులి నారాయణ,ప్రవీణ్ రావు,మేడిశేట్టి మధు పాల్గోన్నారు…