ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహిళ అంటే అబల కాదు సబల అని నిరూపించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. . మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని మహబూబ్ నగర్ బి కే రెడ్డి కాలనీ ఫస్ట్ లో కంప్యూటర్, టైలరింగ్ మరియు బ్యూటీషన్ కోర్సులకు 240 మంది విద్యార్థులతో శిక్షణా తరగతులను ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే ని అభినందించారు..
అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఒక మంచి ఉద్దేశం తో ఏర్పాటు చేసిన ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపాలని అన్నారు. జనాభా లో సగభాగం ఉన్న మహిళలకు మంచి భవిష్యత్తు కోసం ఎమ్మెల్యే పడుతున్న తపన చాలా సంతోషాన్ని కలిగించిందని, ఇక్కడ శిక్షణ పొందేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ అభివృద్ధి లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని 65 ఐటిఐ కళాశాలలను అడ్వాన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా మార్చుతున్నామని, ఈ మధ్యనే మన మహబూబ్ నగర్ లో ఎటిసి సెంటర్ కు శంకుస్థాపన చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అంతకు ముందు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సెట్విన్ సంస్థ సహకారంతో ఈ రోజు మూడు ట్రేడ్ లలో మొత్తం 240 మందికి. మూడు నెలల పాటు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతులను ఇవ్వడం జరుగుతుందని, రాబోయే 10 సంవత్సరాల కాలంలో 20 వేల మందికి నైపుణ్య శిక్షణ అందించే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. మహిళలు, యువత కు ఆర్థిక పరిస్థితి సహకరించక మధ్యలోనే చదువు ఆపిన వారికి ఒక గొప్ప అవకాశం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. ఇక్కడ శిక్షణ పొందిన వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు , వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడే విధంగా మేము నిష్ణాతులైన శిక్షకుల చేత శిక్షణ ఇప్పిస్తామని ఆయన చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం నుంచి కూడా సహాయం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. ఈ మూడు నెలలు ఒక దీక్ష చేపట్టినట్లు శిక్షణ తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, బుద్దారం సుధాకర్ రెడ్డి, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.