కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

సెప్టెంబర్ 27 చలో కలెక్టరేట్ ను విజయవంతం చేయండి
జమ్మికుంట: నేటి ధాత్రి
రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, సెప్టెంబర్ 27న నిర్వహించే చలో కలెక్టరేట్ విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు.వీణవంక మండల కేంద్రంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 85% ప్రయాణీకులు మరియు 66% వస్తువులు కేవలం రోడ్డు రవాణా ద్వారానే రవాణా చేయబడుతున్నాయి. కానీ కార్మికులకు చట్టపరమైన రక్షణ లేదా ఉద్యోగ భద్రత లేదు. పనిలో భాగంగా రోడ్లపైనే ఉంటూ వృద్ధాప్యానికి చేరుకున్న కార్మికులకు కేరళలో తప్ప మరెక్కడా సామాజిక, ఆర్థిక భద్రత లేదు. కేరళలో మోటార్ కార్మికుల కోసం సంక్షేమ నిధి బోర్డు ఏర్పాటు చేయబడింది. ఈ తరుణంలో జాతీయ స్థాయిలో అసంఘటిత రోడ్డు రవాణా కార్మికుల కోసం సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేయడం భారత ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయాల వల్ల గతంలో ఆటోలలో ప్రయాణించే వారి సంఖ్య పూర్తిగా పడిపోయింది. ఫలితంగా ఆటో డ్రైవర్లకు పూట గడవడం కష్టంగా మారింది. విద్యాధికులై ఉండి ఉద్యోగం దొరక్క స్వయం ఉపాధి క్రింది ఆటో డ్రైవర్లుగా పని చేసుకుంటున్న వారు ఇప్పుడు తీవ్రంగా నష్టపోతున్నారు . అందుకని మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో, టాటా ఏసీ, క్యాబ్ డ్రైవర్లకు గీత, నేత, బీడీ కార్మికులకిస్తున్న తరహాలో నెలకు రూ.4,500/- జీవనభృతి ఇవ్వాలని కోరుతున్నాము అని అన్నారు . ఈ కార్యక్రమంలో , మండల కన్వీనర్ పిల్లి రవి యాదవ్, రవాణ రంగా అధ్యక్ష కార్యదర్శులు పున్నం రవి , చెలికని శ్రీనివాస్ , వాసుదేవ రెడ్డి , దాసారపు వెంకటేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!