డా. పెరుమాండ్ల రామకృష్ణ ఎంపీ ఆస్పిరెంట్
వర్థన్నపేట, నేటిధాత్రి:
వర్ధన్నపేట శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన కే ఆర్ నాగరాజు వర్దన్న పేట కి వస్తున్న క్రమంలో హనుమకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ మరియు వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ పెరుమాండ్ల రామకృష్ణ తోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికి విజయోత్సవ ర్యాలీలోపాల్గొన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యేగా గెలుపొందిన కే ఆర్ నాగరాజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నమస్కరించాడు. తదుపరి వర్ధన్నపేటలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడారు.
తనను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులూ మధు మహేష్ తదితరులు పాల్గొన్నారు.