ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్

బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్నసిరిసిల్ల జిల్లా,బోయినిపల్లి మండలంలోని కొదురుపాక గ్రామంలో శనివారం మండల ప్రీమియర్ లీగ్ అద్వర్యంలో జరిగిన సీజన్-1 వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చెన్నాడి అమిత్ రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చెన్నాడి అమిత్ రావు మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి,దేహదారుడ్యానికి,ఆరోగ్యానికి దోహదపడుతాయని, క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జోగినిపల్లి అజిత్ రావు ,జోగినిపల్లి ఆదిత్య రావు,బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు కత్తెరపాక కొండయ్య,లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ నాగయ్య,చిక్కాల సుధాకర్ రావు, ఓదెల మహేందర్,కొదురుపాక స్పోర్ట్స్‌ క్లబ్‌ అధ్యక్షులు ర్యాకం రాజేష్‌,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!