జోగులాంబ జోన్-7 డి ఐ జి శ్రీ ఎల్ ఎస్ చౌహన్ ఐపీఎస్.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జోగులాంబ జోన్-7 ఆఫీస్ మహబూబ్ నగర్ జిల్లా నందు కొండా లక్ష్మన్ బాపూజీ చిత్రం పటానికి పుల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన జోగులాంబ జోన్-7 డి ఐ జి శ్రీ ఎల్ ఎస్ చౌహన్ ఐపీఎస్.
ఈ సందర్భగా డి ఐ జి మాట్లాడుతూ… కొండా లక్ష్మాన్ బాపూజీ జయంతి వేడుకలు ప్రతి ఏడాది సెప్టెంబర్ 27న ఘనంగా నిర్వహిస్తారు. 1915లో జన్మించిన కొండా లక్ష్మాన్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య నేతగా నిలిచారు. ఆయన సమాజసేవకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, మరియు రాజకీయ నాయకుడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్థాపన కోసం చేసిన కృషి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
జయంతి సందర్భంగా సామాజిక సేవకులు, ఉద్యమకారులు ఆయన సేవలను స్మరించుకుంటూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలంగాణలోని వివిధ ప్రదేశాల్లో సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించడం ద్వారా బాపూజీ సేవలు ప్రజలకు చేరువ చేస్తారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్, అదనపు ఎస్పీ రాములు, ఎఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ రమణా రెడ్డి, వర్టికల్ డీఎస్పీ సుదర్శన్, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.