
One Tree for Mother program at school
బడిలో అమ్మ కోసం ఒక చెట్టు
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని ముస్త్యాలపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏక్ పేడ్ మా కే నామ్ అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ తల్లులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.ప్రతి విద్యార్థి తన అమ్మ పేరుతో ఒక మొక్కను నాటడం ద్వారా తల్లిపట్ల గౌరవాన్ని వ్యక్తపరిచారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కందుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ,తల్లి మన జీవితానికి మూలం,చెట్టు ప్రకృతికి మూలం అని, ఇద్దరిని సంరక్షించడం మనందరి బాధ్యత అని చెప్పారు.మొక్కల పెంపకంతో పాఠశాల వాతావరణం మరింత హరితంగా మారడమే కాకుండా,భవిష్యత్ తరాలకు సుసంస్కృతమైన వాతావరణం అందించవచ్చని వివరించారు.
గ్రామస్తులు,తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు.విద్యార్థుల ఉత్సాహం,తల్లుల ఆనందం చూసి పాఠశాల ప్రాంగణం పచ్చని పండుగలా మారింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు పావని,నాగరాజు పాల్గొన్నారు.