శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన దేవాలయం
ఆలయ అభివృద్ధికి నగదు అందజేత
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయం లో.,ఏప్రిల్ 6వ, తారీకు నిర్వహించనున్న శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాని, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముస్తాబ్ చేయటం జరిగింది, అదేవిధంగా ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ ఆదివారం నిర్వహించబోనున్న సీతారాముల కల్యాణ మహోత్సవాలో భాగంగా మొదటిగా ఆలయంలో వేద పండితులు చేత తొలక్కం పారాయణం జరుగుతుంది ఏప్రిల్ ఆరో తారీకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది . తదుపరి హోమాలు అదేవిధంగా గ్రామ పర్యటనలో భాగ ంగా రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఏప్రిల్ 11 వ తారీకు నాగబెల్లి తో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి అని తెలిపారు
రామాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ముసునూరి నరేష్, శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది . అదేవిధంగా గణపురం చెందిన కీర్తిశేషులు అమరాజి మొగిలి జ్ఞాపకార్థం కుమారుడు అమరాజి సతీష్, ఆలయ అభివృద్ధి కొరకు 10, వేల 116 రూపాయలను ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన గౌడ్ కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూలా శ్రీనివాస్ గౌడ్ బటిక స్వామి బూర రాజగోపాల్ మాదాసు అర్జున్ మాదాసు మొగిలి దయ్యాల భద్రయ్య పాండవుల భద్రయ్య మోటపోతుల రాజన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు