Teacher Felicitated on Promotion and Transfer in Laxettipet
ప్రాథమిక పాఠశాలలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయునికకి ఘన సన్మానం
నేటిధాత్రి ,లక్సెట్టిపేట
లక్సెట్టిపేట మండలం బలరావుపేట ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి, ఇటీవల స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)గా పదోన్నతి పొంది బదిలీపై వెళ్లిన ఇండ్ల మల్లేశంని పాఠశాలలో ఘనంగా సన్మానించారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి యశోదర ముఖ్య అతిథిగా హాజరై, మల్లేశం పాఠశాల అభివృద్ధికి మరియు విద్యార్థుల అభ్యుదయానికి చేసిన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మల్లేశం ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి పెంచడంతో పాటు పాఠశాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎ. అంజయ్య, ఉపాధ్యాయులు ఎస్. సత్తయ్య, కాంప్లెక్స్ సీఆర్పీ ప్రణీత్, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొని మల్లేశంని అభినందించారు.
