
వనపర్తి నేటిధాత్రి ;
తెలంగాణ రాష్ట్ర లో ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఆధారంగా సర్దుబాటు చేయుటకు కలెక్టర్లకు విద్యాశాఖ అనుమతినిచ్చిన నేపథ్యంలో అట్టి ఉత్తర్వులను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షులు వేముల అమరేందర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తుందని, నిర్ణీత సమయంలో నిర్దేశించిన విద్యా ప్రమాణాలను సామర్ధ్యాలను విద్యార్థుల్లోపల కల్పించడం అత్యంత కఠినంగా మారిందని వారు తెలిపారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు మాత్రమే సరియైన విధంగా విద్యార్థులకు బోధనాభ్యసన జరుగుతుందని వారు తెలిపారు ప్రభుత్వం ఇలాంటి చర్యల వల్ల ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి పని భారం పడుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ఇలాంటి చర్యలు తీవ్ర విఘాతం కలిగిస్తాయని వీటిని వ్యతిరేకిస్తున్నామనివ వారు ఒక ప్రకటనలో తెలిపారు