నడి కూడ, నేటి ధాత్రి:
తపాల శాఖ పరకాల సబ్ డివిజన్ అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ అనంత రామ్ నాయక్ ఆకస్మికంగా నడి కూడ సబ్ పోస్ట్ ఆఫీస్ ను తనిఖీ చేశారు, తనిఖీలో భాగంగా మెయిల్స్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ అనంత రామ్ నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉన్న తపాలా కార్యాలయాల ద్వారా కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు, దీనిలో భాగంగా రికవరింగ్ డిపాజిట్, సేవింగ్ బ్యాంక్ అకౌంట్, సుకన్య సమృద్ధి యోజన, టైం డిపాజిట్ పథకాలు ఉన్నాయన్నారు. ప్రజలకు భద్రత, పొదుపు పథకాలు, టాటా గ్రూప్ ప్రమాద బీమా పథకాలు, రైతులకు వ్యవసాయ కూలీలకు, ప్రభుత్వ, ప్రైవేటు ప్రతి ఒక్కరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నడి కూడ సబ్ పోస్ట్ మాస్టర్ వేణుగోపాల్, రాజయ్య, రవీందర్, ఎండి హరిప్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.