Sudden Fire on Parked Lorry
అకస్మాత్తుగా మంటలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం దిగ్వాల్ హైవేపై ఆగి ఉన్న లారీకి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అర్పించి ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా మంటలను అర్పించారు. స్థానిక పోలీసులు అక్కడున్న ప్రజలు కూడా ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
