యనగంటి సుమాంజలి
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
జాతీయస్థాయి 33వ సబ్ జూనియర్ కబడ్డీ పోటీలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నుండి గుండాల మండలం కాంచనపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని యనగంటి సుమాంజలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లి టీ ఎస్ డబ్ల్య్ ఆర్ ఎస్ స్కూల్ నందు 9వ తరగతి విద్యార్థిని ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం తెలియజేశారు.
మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వ తారఖు వరకు బీహార్ రాష్ట్రం పాట్నా లో జరగబోయే 33 వ సబ్ జూనియర్ జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాచన పల్లి కి చెందిన యనగంటి సుమాంజలి తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టు తరపున పాల్గొనేందుకు ఎంపికైనట్లు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే జగదీశ్వర యాదవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా సుమాంజలి కి పాఠశాల ప్రధానో ఉపాధ్యాయులు సునీత,పిడి సుజాత, పీఈటి నాన్సీ,కబడ్డీ కోచ్ కనక మహాలక్ష్మి, ములకలపల్లి పాఠశాల టీచర్స్ తోటి విద్యార్థులు, గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు.