
In-charge Amudalappelli Mallesham Goud.
బీసీలకు రాజ్యాధికారం రావాలంటే పోరాటం తప్పదు
జాతీయ బీసీ సంక్షేమ సంఘం పరకాల నియోజకవర్గం ఇంచార్జ్ ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్
పరకాల నేటిధాత్రి
బీసీలకు రాజ్యాధికారం రావాలంటే పోరాటం తప్పదని బీసీ సంక్షేమ సంఘం పరకాల నియోజకవర్గ ఇంచార్జి ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ అన్నారు.గురువారం రోజున మండలంలోని కామారెడ్డిపల్లి గ్రామంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ రాబోయే రోజులలో బీసీలకు రాజ్యాధికారం రావాలంటే మనమంతా ఏకతాటిపై ఉండి ఏకం కావలసిన అవసరం ఉందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మన బీసీల సత్తా చాటాలని మల్లేశం గౌడ్ అన్నారు.అనంతరం గ్రామకమిటిని ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా కోడెల సతీష్,ఉపాధ్యక్షులు రాపర్తి శ్రీధర్ కాసగాని సాయికుమార్,ప్రధాన కార్యదర్శి చిర్ర హరీష్,కార్యదర్శులు రాస రాజేష్,ఎండి.హుస్సేన్ కోశాధికారి గోపరాజు లింగస్వామి,కార్యవర్గ సభ్యులుగా దొమ్మటి భద్రయ్య, చిర్ర భద్రయ్య ల్,ఏదునూరి లింగయ్య,దానం ఓదెలు,కొయ్యల అనిల్ కుమార్,కొయ్యలరమేష్,తడక పూర్ణచందర్,కొక్కుల శ్రీనివాస్,దొమ్మటి రమేష్,చిర్ర రాజయ్య,చిర్ర సాంబయ్య,కోడల భాస్కర్,కోడల రాజేందర్,ఎలగందుల విష్ణు,చిర్ర వివేక్ వర్ధన్,తడక శ్రీనివాస్,చిర్ర ప్రశాంత్,గాజర్ల యల్లేశ్వర్ బీసీ కుల సంఘాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.