అపార్ట్ మెంట్ మెయింటినెన్స్ కు బలమైన చట్టం తీసుకురావాలి

కూకట్పల్లి ఫిబ్రవరి 17 నేటి ధాత్రి ఇన్చార్జి

నివాసితుల వద్ద వసూలు చేసిన డబ్బులు ఇష్టాను సారంగా ఖర్చులు అపార్ట్ మెంట్ లలో మెయింటెనెన్స్
పేరుతో అవినీతిఇటు ఫ్లాట్ ఓనర్లు నష్టపోతున్నారు అటు అసోసియే షన్ పేరుతో చట్టాలను ఉల్లంఘిస్తు
న్నారు.అపార్ట్ మెంట్ మెయింటెనె న్స్ యాక్ట్ తీసుకురా వాలి,తద్వారా అవి నీతి తగ్గుతుంది.సీఎం రేవంత్ రెడ్డికి ప్రజా ఆలోచన వేదిక వ్యవస్థా పక అధ్యక్షులు ఉప్పల గోపాలరావు లేఖ అపార్ట్ మెంట్ సముదాయాల మెయింటనెన్స్ కి ఒక బలమైన చట్టం తీసు కురావాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రజా ఆలోచన వేదిక వ్యవస్థాపక అధ్యక్షు లు ఉప్పల గోపాలరావు విజ్ఞప్తి చేశా రు. ఈ మేరకు సీఎంకు ఆయన ఓ లేఖను ఫాక్స్ ద్వారా పంపారు.పట్ట ణీకరణ నేపథ్యంలో నగరాలలో, పట్టణాలలో అపార్ట్ మెంట్ సముదా యాలలో,విల్లాల లో నివసించేవారు రోజు రోజుకీ పెరుగుతున్నారు.గ్రేటర్ హైదరాబాద్ లో నివసిం చేవారు రోజురోజుకు పెరుగుతున్నారని, అపార్ట్ మెంట్లలో ఎక్కువ నివాసం ఉంటున్నారని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.ని వాసితుల సమిష్టి సౌకర్యాల కో్సం ఒక సొసైటీ ఏర్పాటు తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని,ఆ సొసైటీ పటిష్టమైన చట్టపరిధిలో ఉండాలని సూచించారు. అపార్ట్ మెంట్ యాక్ ప్రకారం కో ఆపరేటివ్ సొసైటీ లో నివాసితుల మెయింటనెన్స్ సంఘాలు కో ఆపరేటివ్ సొసైటీ యాక్ట్ క్రింద తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని అపార్ట్ మెం ట్ యాక్ట్ చెబుతున్నదని వినతి పత్రంలో వివరించారు.మెయింటనె న్స్ చెల్లించే ప్రతి వారికి ఆ సొసైటీ జవాబుదారీగా ఉండాలని,ప్రస్తుత అపార్ట్ మెంట్ మెయింటనెన్స్ సం ఘాల విధానం అనేక సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నదని పేర్కొన్నారు.అపార్ట్ మెంట్లో నివసి స్తూ మెయింటనెన్స్ చెల్లించే వారికి సరి అయిన సమాధానం చెప్పే వా తావరణం కనిపించడం లేదన్నారు. అపార్ట్ మెంట్ సొసైటీలు నేడు స మాజ సేవకుల చేతుల్లో కాకుం డా,కొంతమంది పెత్తందార్ల చేతిలో బందీ అయినదని వినతి పత్రంలో వివరించారు.మెయింటనెన్స్ చెల్లిం చేవారు మౌనంగా బాధపడుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నా రు. తొమ్మిది నుండి పది కోట్ల రూపా యల పైనే లావాదేవీలు జరుగుతు న్నా అపార్ట్మెంట్ మెయింటనెన్స్ సం ఘాల కు చట్టబద్దత లేదని,చట్టబద్ద త లేని విషయం అడిగేవారు లేరు.
అడిగినా చెప్పేవారు లేరన్నారు. యావరేజ్ రోజు వారి ఖర్చు రెండు లక్షల కి మించి వున్నా కూడా మె యింటనెన్స్ చెల్లించే వారికి ఆ ఖర్చుల వివరాలు తెలియవని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.


రోజు వారి క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎంతో,ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎం తో ,క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంతో,రోజు
వారీ జమా ఖర్చులెంతో మెయింటనె న్స్ చెల్లించే వారికి తెలియదు.అడి గినా చెప్పరని లేఖలో పొందుపరి చారు. క్యాష్ బుక్ మెయింటైన్ చేయడం ప్రతి సొసైటీ కి చట్టపరంగా ఉండాల్సిన అవసరం ఉందన్నా రు.క్యాష్ బుక్ అనేది మెయిం టెనె న్స్ చెల్లించే వారి పబ్లిక్ డాక్యుమెం ట్ అని పేర్కొన్నారు..సంవత్సరానికి ఒకసారి జనరల్ బాడీ సమావేశం
లో గుండుగుత్తా స్టేట్మెంట్ ఇస్తారు. 365 రోజుల్లో ఖర్చుపెట్టిన కోట్లాది రూపాయలు సద్వినియోగ ఖర్చు
లేమిటి, దుర్వినియోగ ఖర్చు లేమి టి అనేది జనరల్ బాడీ మీటింగ్ లో తెలుసుకోవ డం,అడగడం మెయిం
టనెన్స్ చెల్లించే వారికి సాధ్యమేనా? అపార్ట్ మెంట్ మెయింటనెన్స్ సం ఘాలు, మెయింటనెన్స్ చెల్లించే
వారి ప్రయోజనాల కన్నా సొసైటీ పెత్తందారుల ప్రయోజనాలకే అడ్డా గా మారిందని సీఎంకు రాసిన లేఖ లో పేర్కొన్నారు. అపార్ట్ మెంట్ మెయింటనెన్స్ సంఘాలలో జరుగు తున్న అవకతవకలను అరికట్టి మెం యింటనెన్స్ చెల్లించే వారి ప్రయోజ నాలను కాపాడే పటిష్టమైన అపా ర్ట్మెంట్ మెయింటెనెన్స్ యాక్ట్ తీసు కురావలసినదిగా రాష్ట్ర ముఖ్యమం త్రిని కోరారు. ఆ యాక్ట్ లో కో- ఆపరే టివ్ అధికారులే కాకుండా సంఘాల అవకతవకలను అరికట్టే అధికారం జిల్లా కలెక్టర్ కు, పోలీస్ శాఖ వారికి మెయింటనెన్స్ చెల్లించే వారి ఫిర్యా దులపై విచారించి తగు చర్యలు తీ సుకునేటట్లు చట్టంలో పొందుపరచ వలసినదిగా ముఖ్యమంత్రి కీ రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!