కంపు కొడుతున్న కాంట్రాక్టర్ బస్తీ.
బెల్లంపల్లి నేటిధాత్రి :
ఇంటి పనుల కోసం బస్తీలోకి వస్తే అసలు మునిసిపాలిటీకి పన్నులు దేనికోసం కట్టాలి అని నిలదీయడానికి బస్తి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న కౌన్సిలర్ కూడా ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులు కూడా పట్టించుకోవడం లేదు
బెల్లంపల్లి పట్టణంలోని 18. వార్డ్ కాంట్రాక్టర్ బస్తీలో కాలువలు ఏరులైపోరుతున్నాయి చెత్త రోడ్డు మీద పేరుకుపోయి దుర్వాసనకు బస్తి ప్రజలు అల్లాడుతున్నారు కానీ సంబంధిత మున్సిపల్ అధికారులు కన్నెత్తి కూడా చూడరు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరు ఇక బెల్లంపల్లి మునిసిపల్ కమిషనర్లు ఎంతమంది మారినా కానీ కాంట్రాక్టర్ బస్తి కంపు మాత్రం వదలడం లేదు నడిరోడ్డు మీద గుంతలు తవ్వి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా గాని దాన్ని సరి చేయలేదు గుంతలు పూడ్చలేదు అత్యవసర పరిస్థితిలో కనీసం మూడు చక్రాల ఆటో కూడా బస్తీలోకి రాక గతంలో ఇద్దరి ప్రాణాలు పోయినా కానీ పట్టించుకోని మునిసిపల్ అధికారులు ఇంటి పన్నులు వసూలు చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ వార్డు పారిశుద్ధ్యం పై లేకపోవడం సోషనీయం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇంటి పనులు కట్టే ప్రసక్తే లేదని వార్డు ప్రజలు అంటున్నారు అసలు కాంట్రాక్టర్ బస్తి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఉందా లేదా ఏదైనా గుట్ట కింది మారుమూల అడవిలో ఉందా అర్థం కావడం లేదు అని వాపోతున్నారు.