భూపాలపల్లి నేటిధాత్రి
ప్రతి ఒక్కరి జీవితంలొ స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం.
ప్రతి ఒక్కరి జీవితంలొ స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. ఆనందం, బాల్యం, స్మృతులు, కరచాలనాలు, చెమ్మగిల్లిన కళ్ళతో అలింగనాలు గురువుల మందలింపులు తలుచుకుంటూ ఒకసారి వయస్సు మరచి పోయి చిన్న పిల్లల కేరింతలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రాఘవరెడ్డి పేట
అవరణం కోలాహలంగా మారింది. ఈ ప్రాంగణంలో అడుగు పెడుతూనే హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రాఘవరెడ్డి పేట
పాఠశాలలో 2008-09 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పండుగగా మారింది.
16 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిన వారు కొందరు, ఎక్కడెక్కడో స్థిర పడిన వారు కొందరు, ఉద్యోగాల్లో కొందరు, సహదర్మచరినిలుగా కొందరు, వివిధ స్తితుల్లో జీవిస్తూ తమ మిత్రులను కలవాలనే కలంపులో ఆనాటి విద్యార్థులైన కొంత మంది విద్యార్థులకు ఆలోచన కలిగింది. ఈ సమ్మేళనంలో తమ గురువుల బోధనలు తమ కుటుంబ పరిస్థితులు నాటి చిలిపి చేష్టలను క్రమశిక్షణ పేరుతో గురువుల దండనలు తలుచుకుంటూ సాగిన పూర్వ విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆడిన ఆటలు పాటలు అలరించాయి. వచ్చిన పూర్వ విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రాఘవరెడ్డి పేట
ఆవరణలో పొద్దు పోయే వరకు గడిపి బరువెక్కిన హృదయాలతో ఎవరి గమ్య స్థానాలకు వారు కదిలారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు
గంగిశెట్టి వెంకటేశ్వర్లు,బత్తుల సదానందం,దేవేందర్రావు సర్ ,ఇంద్రాదేవి మేడమ్,రఘుపతి సర్,రవి సర్ లు
పూర్వ విద్యార్థులు సునీల్, అఫ్జల్, సంగి తిరుపతి,
కొండ్రఅనిల్ ,మాధవరావు ,చిలుక
సంధ్య,అమూల్య,అనూష మొదలగువారు పాల్గొన్నారు . విద్యార్థులు సమాజసేవ చేయడమే మా
లక్ష్యం అని
ఆ మార్గంలో కృషి చేయాలని & గవర్నమెంట్ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని కోరుకున్నారూ
& ఉపాధ్యాయులు సూచించారు.