మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 18
మండలంలోని ఇస్సిపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2002–2003 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకుని, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నాటి ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి, ఉపాధ్యాయ బృందం వెంకట నరసయ్య, ప్రభాకర్, హుస్సేన్, బ్రహ్మానందం, రవీందర్, మల్లయ్య, మాధవి విద్యార్థులు తదితరులున్నారు.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
