ఆర్డీవోకు వినతి పత్రం అందజేత
జమ్మికుంట: నేటి ధాత్రి
తెలంగాణఉద్యమ కారులకు 250 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్వర్యం లో ఆర్డిఓ రమేష్ బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన ప్రభుత్వంగా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని నాయకులు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం అనేక వర్గాలకు పెద్దపీట వేస్తుందని., అలాగే తెలంగాణ ఉద్యమకారుకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెన్షన్ అమలు చేయాలని, తెలంగాణ ఉద్యమకారుకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యమకారుల పక్షాన కోరారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ ఎక్కటి సంజీవరెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అద్యక్షులు కనకం కుమారస్వామి,, మాజీ జెడ్పిటిసి అరుకాల విరేషలింగం, ఊకంటి మల్లాచారి, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు జవ్వాజి కుమార్, కొమ్ము అశోక్, అన్నం ప్రవీణ్, దబ్బట రాజు, ఆకుల రాజేందర్, మల్లేష్, మూడెడ్ల కుమార్, కంది దిలీప్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బిజిగిరి శ్రీకాంత్, మద్దూరి శంకరయ్య, వాసాల రామస్వామి, రాం చంద్రమౌలి, రజినికాంత్, ఎర్ర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.