Call for a Discrimination-Free Society
వివక్ష లేని సమాజం – మనందరి బాధ్యత
– ఎస్సై ఎం కాశీనాథ్
–
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మార్చ్ 31: వివక్ష లేని సమాజం కోసం అందరూ కలిసి కృషి చేయాలనే జహీరాబాద్ గ్రామీణ ఎస్సై ఎం కాశీనాథ్ యాదవ్ అన్నారు. జహీరాబాద్ మండల పరిధిలోని తూముకుంట గ్రామంలో మంగళవారం పౌర హక్కుల దినోత్సవం సమావేశంలో మాట్లాడుతూ..”కుల, మత, వర్గ వివక్షలు లేని సమాజం ఏర్పడినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. రాజ్యాంగం కల్పించిన సమానత్వ ఫలాలను ప్రతి పౌరుడు పొందేలా చూడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అంశాల గురించి వివరించారు. చదువుకున్న వారు గ్రామీణ ప్రాంతాల్లో అంటరానితనం వంటి దురాచారాల పట్ల ప్రజలను చైతన్యపరిచి, దేవాలయాలు, పాఠశాలలు, హోటళ్లు,బహిరంగ ప్రదేశాల్లో అందరికీ సమాన గౌరవం దక్కేలా చూడాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ ఇన్స్పెక్టర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
