_విద్యార్థులకు దుర్వాసన, రోగాలు
_ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం కాలేదు
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కన పురాతనమైనటువంటి భావి ఉన్నది. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మురుగు నీరు భావిలోకి చేరడంతో పూర్తిగా మురుగు నీటితో నిండిపోయింది. దీంతో పాఠశాల విద్యార్థులకు, చుట్టూ ఇళ్లలోని వారికి దుర్వాసనగా తయారయింది మురుగు నీటిలో దోమలు, ఈగలు తయారవడంతో రోగాల పాలవుతున్నారు. వాసనకు తోడు మురుగునీటిలో ఉన్న విష పాములు , తేళ్లు చుట్టూ ఉన్న గృహాల్లోకి చేరుతున్నాయి . దీనికి తోడు సమీప స్థలాన్ని డంపింగ్ యార్డ్ గా తయారు చేస్తున్నారు. గతంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా వచ్చిన కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. కలెక్టర్ సంబంధిత అధికారులకు సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అయినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు ఇప్పటికైనా సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చేయాలని విద్యార్థులు, చుట్టుపక్కల గృహ యజమానులు వేడుకుంటున్నారు
పాఠశాల పక్కనే మురుగు బావి
