# చైర్మన్ గా తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం మొగిలి ముదిరాజ్
# నర్సంపేట నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకం
# జీ.వో.నెం. 463 ద్వారా ఉత్తర్వులు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
# ప్రకటన విడుదల చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట, నేటిధాత్రి :
తెలంగాణ మలిదశ ఉద్యమంలో మొదటినుండి పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులను అరుదైన గౌరవం దక్కింది.వారికి నర్సంపేట వ్యవసాయ నూతన కమిటీని ఏర్పాటు చేస్తూ జీ.వో.నెం. 463 ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయగా మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రకటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో తనతో పాటు రాష్ట్ర ఏర్పాటు వరకు అలాగే బంగారు తెలంగాణ సాధించటం కోసం కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన ఉద్యమకారులకు నేడు అరుదైన గౌరవం దక్కిందన్నారు. ఉద్యమకారుల పట్ల ఇటీవల నర్సంపేట పట్టణంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇచ్చిన మాట ప్రకారంగా నేడు వారికి ప్రభుత్వం గౌరవ దక్కించిందన్నారు.వ్యవసాయ మార్కెట్ కమిటీ
చైర్మన్ గా తెలంగాణ ఉద్యమకారుడు,పార్టీ సీనియర్ నాయకుడు దుగ్గొండి మండలానికి చెందిన పొన్నం మొగిలి ముదిరాజ్ , వైస్ చైర్మన్ గా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లబెల్లి మాజీ వైస్ ఎంపిపి పాలేపు రాజేశ్వర్ రావు,
డైరెక్టర్లు గా వివిధ మండలాలకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు
1.పెరుమాండ్ల ప్రభాకర్ రెడ్డి,2.మాదాసి కుమారస్వామి,3. తోటకూరి రాజు,4.వాసం కరుణ,5. వల్లాల కరుణాకర్,6.మోర్తాల రామారావు,7.బోడ కల్పన,8.ఎస్కే షరీఫ్,9.జెరిపోతుల వెంకటేశ్వర్లు,10.పెండెం వెంకటేశ్వర్లు.
# (వ్యాపార వర్గం – అర్తిదారులు)
11. ఏడాకుల మల్లారెడ్డి.
12. దొడ్డ రవీందర్.
# కమిటీ అధికారులు..
13.పిఏసిఎస్ చైర్మన్ చెన్నారావుపేట,
14. జిల్లా మార్కెటింగ్ అధికారి,
15. నర్సంపేట అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (ఏడిఏ)
16. నర్సంపేట మున్సిపాలిటీ చైర్మన్,